తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

దండోపాయం ద్వారా అదుపు చేస్తే తప్ప ముస్లింల ప్రతిఘటనా శక్తిని నిలవరించలేమన్న నిర్ణయానికి వచ్చి ప్రభుత్వాలు ఐఎస్‌ఐ బూచిని దేశం మీదికి వదిలాయి. నల్గొండ పట్టం, జిల్లా లోని ఇతర గ్రామాలకు చెందిన ముస్లిం యువ కులు అనేకులు ఇప్పటివరకు పోలీసులు ఐఎస్‌ఐ ఏజెంట్లని చెప్పి చంపారు. జల్‌జలా నేపథ్యంలో ఈ తక్ష అంశం అతి ముఖ్యమైనది. ముస్లింలకు చదువు లేదు. చదువుకున్న కొందరికి ఉద్యోగాలు లేవు. పనిలేదు. నిలవ నీడ లేదు. ముస్లింలలోని అతి కొద్దిమంది ఉన్నత కులాలకు చెందిన వారిని మినహాయిస్తే ఆదాపు 90 శాతం మందికి ఈనా టికి ఈ దేశంలో పౌరుల హోదా లేదు. రోజురో జుకూ ముస్లింలుమరింత మార్జినలైజ్‌ అవుతు న్నారు. సమాం అంచులకు నెట్టి వేయబడు తున్నరు. హౌదరాబాద్‌ స్టేట్‌లోని తెలంగాణ ప్రాం తం ఆంధ్రప్రదేశ్‌లో 1956 విలీనమైన నాటి నుంచి ఇక్కడి ముస్లింల పరిస్థితి ఇంకా ఇంకా దిగ జారుతున్నది. మస్లింలలో, ముఖ్యంగా షియా తెగ కు చెందిన వారిలో మధ్యతరగతి ఈనాటికీ పుట్ట లేదు. దూదేకుల కులస్తులు వృత్తి కోల్పోయి, చదు వు లేక అత్యంత దయనీయమౌన జీవితం గడుపు తున్నారు. ఖాజా కవిత ‘నరం తెగిన కవాను’లో దూదేకుల వారి జీవన సంక్షభాన్ని దర్శించవచ్చు. మన రాష్ట్రంలోని షియా ముస్లింలలో అత్యధికులు హిందూ మత పీడన నుంచి విముక్తి కోరి ఇస్లాం పుచ్చుకున్న మాదిగ, మాల, బీసీ కులాలకు చెంది నవారేనన్న వాస్తవాన్ని ఇక్కడ మనం గమనిం చాలి.ఇస్లాం మతంలో చేరినా, హిందూ మతం రాక్షస నీడ కులవివక్ష రూపంలో , పేదరికం రూ పంలో వారిని వెన్నాడుతున్నది. మతం మార్పిడి చేసుకున్న దళిత, బహుజనులు క్రైస్తవంలో వివ క్షకు గురవుతున్నట్టే ఇస్లాంలో కూడా గురవు తున్నారు. మతాతీత మానవత్వం, ఇస్లాం మత తత్వపు అత్యున్నత రూపం అయిన సూఫిజం ప్రభావం షియాలపైనే తప్ప సున్నీలపై లేదు. పీర్ల పండుగ జరుపుకునే షియాలకు, జరుపుకోని సున్నీలకు మధ్య పూరించలేని అగాధాలు వుండ టానికి సూఫీ అంశం ఒక ముఖ్య కారణం. సూఫీ మత ప్రచారకులైన ఫకీర్లు షియాలే. దర్గాకు పో యేది. దర్గాల దగ్గర జరిగే ఉర్సుకు వేల సంఖ్య లో వెళ్ళేది, ఖవాలీలు పాడేది షియాలే. ‘జల్‌జలా’ కవులు పుట్టుకతో అయినీ కాకపోయినా స్పిరిట్‌లో షియాలే. వీరిలో ఎక్కువ మంది పుట్టుకతో షియా లైనా ఆశ్చర్యం లేదు. మన దగ్గర మాల, మాది గల మధ్య ఎంత తేడా వుందో, అంతకన్నా ఎక్కు వ తేడా సున్నీ, షీయాల మధ్య వుంది. అందుకే ‘జల్‌జలా’  ఒక మాదిగ కేక. ముస్లింలలో అట్టడు గున వున్న వారి పొలికేక. నిమ్నశ్రేణి ప్రజానికం ముక్తకంఠం.

ఆ రోడ్డు అ ది తలలు తెగిన నల్లగొండ ..పదవీ వరం పొందడానికెవడో మమ్మల్ని బలి చ్చిన హైద్రాబాద్‌, పైజామాల్ని సన్తీల్ని వెతికి పొడ ిచి డ్రైనేజిల్లో కుక్కి బొంబాయి..నా చెల్లెళ్లని, అమ్మ ల్ని బరిబత్తల పరిగెత్తించిన సూరత్‌..మా ప్రాణా లు బిక్కు బిక్కుమన్న అయోధ్య..మా శవాల గట్టలే సరిహద్దులైన కాశ్మీర్‌! హిందూత్వం…! ఈ దేశా న్ని పట్టి  పీడిస్తున్న మహమ్మారి. స్కైబాబ సర్బక ఫ్‌లో గీసిన ఈ రక్తసిక్త దేశపటంలో జల్‌జలా కవి త్వపు ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. జల్‌జలా కవులు ఒక్క తమ ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే హిందూ మతతత్వంపై జిహాద్‌ కు దిగా రనుకుంటే అది పొరపాటు. ఈ దేశం నిజానికి ఎవరికి చెందుతుందో, ఎవరికి చెందాలో వారి కో సం, అంటే దళిత, గిరిజన, బహుజనులం దరికో సం వాళ్లు తలకు కఫన్‌ కట్టి కదులుతున్నారు.

‘ఆవాజ్‌ దో హమ్‌ అనేక్‌ హై’ అంటూ నినదిస్తు న్నారు. కాలం చెల్లిన పాత నినాదాలను తలకిందు లు చేసి పునర్‌ నిర్వచిస్తున్నారు. కర్బలా మైదా నంలో రణానికి నస్నద్దమవుతున్నారు. ‘జల్‌జలా’  కవుల కవిత్వాన్ని విడివిడిగా పరిశీలించి, బేరీజు వేసే ముందు, ఈ కవులు ఆవిష్కరించిన మరో సామాజిక కోణాన్ని చేతనను ఇక్కడ ప్రస్తావిసు ్తన్నాను. అగ్రకులాలు, తమ మధ్య లంతర్గతంగా ఎన్ని వరుధ్యాలున్న, కొత్త వైరుద్యౄలు తలెత్తినా ఐక్యంగా, ఏకతాటిపై వుంటారు. వుండటానికి ప్రయత్నిస్తారు. విడిపోతే బలహీనపడిపోయి, చితికిపోతామని వారికి బాగా తెలుసు. అందుకే తమ ప్రయోజనాల పరిరక్షణకు, అవసరార్థం ఫ్రం ట్‌ కడతారే తప్ప పూర్తిగా విడిపోరు. కాంగ్రెస్‌తో సీపీఐ జత కట్టడానికి సిద్దపడటం ఇందుకు తాజా ఉదాహరణ. దోచుకోవడంలో వెనకబడ కూడద న్నదే వీరి ఉమ్మడి ద్యేయం. అందుకే అలయన్స్‌ దళిత బహుజనులు ఇందుకు భిన్నంగా తమ ప్రత్యేకతలననుసరించి, తమ బలాన్ని నిలుపుకుం టారు. పెంచుకుంటారు కూడా. సామజికంగా, సాంస్కృతింగా ఇది వారి విశఙష్టత విప్లవ సాహి త్యోద్యమ అనంతర కాలంలో తలెత్తిన స్త్రీవాద, దళిత, బహుజన వాదాలకు చెందిన రచయితలు, ఆలోచనాపరులు, రాజకీయవాదులు ఒకే గొడుగు కింద కాకం, భిన్న విభిన్న గ్రూపులుగా విడివడి వండటం ఇందుకు నిదర్శనం. మాదిగ దండోరా ఉద్యమం తరువాత దళిత, బహుజన మైనారిటీ ఐక్యత నినాదం సారహీనమైపోయి. అర్థాన్ని కో ల్పోయింది. మాదిగ కవులు, రచయితలు దళిత బ్యానర్‌ నుంచి వేరైపోవడంతో రళితులంటే మాల లు మాత్రమేనని నిర్దారణ జరిగిపోయింది. బహు జనులు అంటే బీసీలు కూడా ఇప్పుడు తమ సొం త ఉనికి కోసం ఆరాటపడుతున్నారు. తెలంగా ణవాసులు రచయితలు కూడా ప్రస్తుతం అదే బాటన నడుస్తున్నారు. అలాగే ఆదివాసులు, అం దులో మళ్లీ లంబాడాలు, లంబాడాలు కాని ఇతర అంటే గోండు తదితర ఆదివాసి తెగలు, ముస్లిం లు, వారిలో మళ్లి దళిత ముస్లింలు, స్త్రీలు, స్త్రీల లో మళ్లీ ఉన్నత కులాలు, నిమ్న కులాలు ఇలా 85 శాతం ప్రజానికం ఎవరికి వారు విడివిడిగా తమ ఉనికిని నిర్దారణ చేసుకునే ప్రయత్నంలో వున్నారు. ముస్లిం రచయితలు కూడా జల్‌జలా పుస్తకం ద్వారా తమ ఐడెంటిటీని, దళిత, బహుజ నులకు భిన్నమైన తమ ఉనికిని ఆవిష్కరించార. సందర్భం వచ్చినప్పుడు ఐక్య సంఘటనగా ఏర్పడ టానికి వీరంతా తాత్వికంగా సంసిద్దత కనబరు స్తూనే నిర్దిస్టమైన ఉనికిని విడివిడిగా సాధించే క్రమంలో వున్నారు.

సంప్రదాయ మార్కిస్టులు భావిస్తున్నట్లు ఇది ప్రతికూల పరిణామం కానేకాదు. లోలోన లుకలు కలాడుతున్నా పైకి ఐక్యంగా కనిపిస్తూ ఒకే బ్యాన ర్‌ కింద, ఒకే టైమ్‌ టేబుల్‌, ఒకే సిలబస్‌తో కృత్రి మంగా కలిసివుండటం కన్నా ఇలా కలిసి వున్న ప్రతిసారీ, అందరిపేరు చెప్పి ఏ ఒక్కరో లబ్ది పొం దడం జరిగింది. అభ్యుదయ, విప్లవ సాహిత్య శిబిరలాలలో బ్రాహ్నణ తదితర అగ్రకులాలు, దళి త బహుజన  శిబిరంలో మాలలు ఎవరంతట వా రు వేరు పడటం, తమను తాము తెలుసుకోవడం ఉత్తమమని ఇప్పుడు ప్రజాస్వామికవాదులందరూ దాదాపు అంగీకరిస్తున్నారు. ముస్లిం రైటర్స్‌ ఫోరం నల్లగొండలో ఏర్పడటం ఈ దశలో దిశానిర్దేశం చేస్తున్నది. అంతకు మునుపు, మూడెళ్ల క్రితం నల్ల గొండలోనే ఏర్పడిన గొసంగి కవలు గ్రూప్‌ ఈ వాస్తవాన్నే ప్రస్పుటం చేస్తున్నది.

-వేముల ఎల్లయ్య, స్కైబాబ

ఇంకావుంది…