తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

రేగోడు /జనం సాక్షి సెప్టెంబర్:
వీరవనిత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 127 జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని రేగో డ్ మండల రజక సంఘం అధ్యక్షులు రాములు అన్నారు. రజక సంఘాల ఆధ్వర్యంలో రేగోడుతోపాటు మండల వ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. భూమికోసం భుక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాడిందనివారు కొనియాడారు .ఈ కార్యక్రమంలో మర్పల్లి సర్పంచ్ సిద్ధారెడ్డి మాజీ పిఎస్ సిఎస్ చైర్మన్ రాధా కిషన్ గుప్తా,మాజీ ఉపసర్పంచ్ తూర్పు మానయ్య, రజక సంఘాల బాధ్యులు మోహన్, శేఖర్, నారాయణ,తుకారం, ప్రశాంత్ యాదయ్య, నర్సింలు,రాజు అనిల్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.