దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : ఐదో జోన్‌లో ఖాళీగా ఉన్న ఉర్దూ మాద్యమం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్‌ అధ్యాపకుల పోస్టుల కోసం జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్‌అశోక్‌ పేర్కొన్నారు. మొత్తం పది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మూడు ఎకనామిక్స్‌, రెండు పొలిటికల్‌ సైన్స్‌, నాలుగు హిస్టరీ, ఒక ఉర్దూ పోస్టు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆయా విషయాలలో 55 శాతం మార్కులు పొంది, జూలై నాటికి 33 ఏళ్ల వయస్సు గలవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు తమతమ దరఖాస్తులను రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ కాలేజీ ఎడ్యుకేషన్‌, వరంగల్‌ చిరునామాకు పంపాలని ఆయన తెలిపారు. దరఖాస్తు ఫారాన్ని విద్యార్హతలతో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాలను జత చేయాలని ఆయన కోరారు.