దళితబంధును స్వాగతిస్తూ కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం


నల్లగొండ,అగస్టు7(జనంసాక్షి): దళితబంధు పథకం అమలుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఎక్కడిక్కడ సిఎం కెసిఆర్‌ను అభినందిస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. అక్కడక్కడా ర్యాలీలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దళితబందు అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఎస్సీవర్గాలు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగర్‌ భార్గవ్‌ పాల్గొన్నారు. అంతకు ముందు భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకం అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు