నక్సల్స్ సానుభూతి పరుల లొంగుబాటు
భద్రాచలం: మావోయిస్టులకు సహకరిస్తున్న ఖమ్మం జిల్లా వెంకటాపురం, చర్ల మండలాలకు చెందిన దాదాపు 148 మంది సానుభూతి పరులు జిల్లా ఎస్పీ హరికుమార్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లొంగిపోయిన సానుభూతి పరులకు ప్రభుత్వ పరంగా ఆయా గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. వారిపై నమోదయిన కేసులను ఎత్తివేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కొత్తగూడెం ఓఎస్డీ శ్రీనివాసరావు, భద్రాచలం ఏఎస్డీ డా.గజరావు భూపాల్ పాల్గొన్నారు.