నగదు సాయం, సన్మానం…

చిలప్ చేడ్/24ఆగస్టు/జనంసాక్షి :- ఇంటర్నేషనల్ స్థాయిలో గెలుపొందేందుకు తన వంతు సహకారం అందిస్తానని బిజెపి మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సిరిపురం గ్రామానికి చెందిన మహేష్ గౌడ్ ఢిల్లీలో జరగబోయే కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కు సెలక్షన్ అయ్యాడు. ఆర్థిక పరిస్థితుల వల్ల సరైన కోచింగ్ తీసుకోలేక వెళ్లడానికి గాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న శ్రీకాంత్ గౌడ్ మహేష్ గౌడ్ కు శిక్షణ కింద కోచింగ్ కోసమై రూపాయలు 3000 నగదు అందజేశారు. అనంతరం మహేష్ గౌడ్ ను సన్మానించారు.ఈకార్యక్రమంలో మాస్టర్ కిక్ బాక్సింగ్ స్టేట్ జాయింట్ సెక్రెటరీ పోచయ్య రమేష్ గౌడ్, కృష్ణ తదితరులు ఉన్నారు.