నగరంలోని రంగశాయిపేట రామాలయంలో మహా అన్నదానం..
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 30(జనం సాక్షి)
రంగశాయిపేటలోని చారిత్రాత్మక రామాలయంలో శ్రీరామ భజన మండలి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు స్కంద మాతా దేవీగా దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మ వారి ఆశీస్సులు పొందారు….
ఈ కార్యక్రమాల్లో స్థానిక 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందనపూర్ణచందర్, కోడిపాక స్వరూపరాణి, రమాదేవి, బిట్ల వింధ్యారాణి,సబితా కొల్లూరి స్వరూపా రాణి, జమున, మీనా కుమారి, స్రవంతి, ఆశ, సోమ మనోహర్, అనిల్, చిదురాల భరత్, రాంబాబు, దేవులపల్లి శ్రీనాధ్, భక్తుల పాల్గొన్నారు.