నదిలో చేపలు పట్టేందుకు బలవంతంగా విద్యార్థుల తరలింపు

మహబూబ్‌నగర్‌ : తుంగభద్ర నదిలో చేపలు పట్టేందుకు ఐదుగురు విద్యార్థులను బలవంతంగా కొందరు వ్యక్తులు తీసుకువచ్చారని ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయవాడలో పదో తరగతి చదువుతున్న శివ అనే విద్యార్థి బీసీ వసతి గృహంలో ఉంటున్నాడు. తుంగభద్రలో చేపలు పట్టడానికి తనతోపాటు మరికొంత మంది విద్యార్థులను ఆలంపూర్‌ మండలం గొందిమల్లకు తీసుకువచ్చారని ఆలంపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విద్యార్థి వెంట సంఘటనా స్థలానికి బయలుదేరారు.