నింగికెగసిన చదువుల తల్లి – నేల రాలిన తల్లిదండ్రుల ఆశలు.

ఫోటో రైటప్: పరీక్ష రాయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్వాతి.
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలకేంద్రంలోని బూరం స్వాతి ఫార్మసీ పరీక్ష రాయడానికి వెళ్తూ ప్రమాదానికి గురైన విషయం విదితమే. ఇరవై ఆరు రోజుల పాటు ఆ చదువుల తల్లి మృత్యువుతో పోరాడి ఓటమి చెందింది. చదువుల తల్లి ఓటమిని నెన్నెల మండల వసూలు తట్టుకోలేక పోతున్నారు. ఈనెల 2న ఫార్మసీ పరీక్ష రాయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన బూరం స్వాతి చికిత్స నిమిత్తం నిమ్స్ లో చేర్చారు. మనసున్న ప్రతి ఒక్కరినీ ఆ ప్రమాదం బాధించింది. తనకు తోచిన విధంగా సాయం చేసి స్వాతి కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. అన్ని వర్గాలు అండగా ఉండి చదువుల తల్లిని కాపాడుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆతల్లి 26 రోజులు మృత్యువుతో పోరాడి ఈరోజు చేతకాక చేతులెత్తేసింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 7లక్షలు ఎల్ఓసి మంజురూ చేసిన ఫలితం దక్కలేదు. స్వాతి మరణ వార్త విన్న మండల వాసులు శోకసంద్రంలో మునిగి పోయారు. ఆ చదువుల తల్లిని మృత్యువు అర్దాంతరంగా తీసుకెళ్లడం పై విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె బతికి పేదలకు సేవ చేయాలని తలచిన మండల వాసులకు నిరాశ ఎదురయ్యింది.