నిక్‌నైట్‌ పై వ్యాఖ్యాలు : కెవిన్‌ పీటర్సన్‌ కు భారీ జరిమానా !

ఇంగ్లండ్‌ మే 24 :

మాజీ ఇంగ్లాండ్‌ఓపెనర్‌ ప్రస్తుతం స్కైస్పోర్ట్స్‌ఛానల్‌ క్రికెట్‌ వ్యాఖ్యాత నిక్‌నైట్‌పై సమర్థించలేని వ్యాఖ్యాలు చేసిన ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ కెవిన్‌పీటర్సన్‌కు బయటకు చెప్పలేనంత భారీజరిమానా విధించారు.అయితే కెవి న్‌పీటర్సన్‌కు ఎంతమొత్తం జరిమానా విధించారన్నది తెలియరాలేదు.కెవిన్‌ పీటర్సన్‌ ట్విట్టర్‌లో టెస్టు క్రికెట్‌ పోటిల్లో నిక్‌నైట్‌ ఎలావ్యాఖ్యాత అయ్యారనేది ఎవరైనా తనతో చెప్పగలరా? అని వివాదాస్పద వ్యాఖ్యాలు చే శాడు. కెవిన్‌పీటర్సన్‌ చేసిన ఈవ్యాఖ్యాలపై ఇంగ్లాండ్‌ క్రికెట్‌బోర్డు అధికారులు సీరియస్‌ అయ్యారు. పీటర్సన్‌ ఇలాంటి వ్యాఖ్యాలుచేయడం కాంట్రాక్టును ఉల్లంఘీంచినట్లవుతుందని పేర్కోన్నారు. బహిరంగంగా వ్యాఖ్యాలుచేసేందుకు కోన్నినిబంధనలు ఉన్నా యని ఇంగ్లాండ్‌క్రికెట్‌బోర్డు ఈ సందర్భంగా గుర్తుచేసింది.అంతేగాకుండా ఈసీబీ పీటర్సన్‌కు భారీ జరి మానా విధించింది.