నిమజ్జనానికి బైకులపై బొజ్జ గణపయ్య

నిమజ్జనానికి బైకులపై బొజ్జ గణపయ్య

వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 27 (జనంసాక్షి):

తొమ్మిది రాత్రులు ఘనంగా పూజలందుకున్న గణనాథుడు పదవరోజు బుధవారం జనానికి బయలుదేరాడు. క్రమంలో వరంగల్ నగరంలో గణపతి నిమర్జనం ఉత్సవాలు ఘనంగా జరిగాయి భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న వినాయకులను భక్తులు ఉదయం నుంచే స్థానిక చెరువులలో నిమజ్జనం చేయడానికి బయలుదేరారు. ఈ క్రమంలో వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని ఉరుసు రంగసముద్రం చెరువు బెస్తం చెరువు చిన్న వడ్డేపల్లి చెరువు తోపాటు ఆయా ప్రాంతాల్లోని చెరువులలో వినాయకుల నిమజ్జనం చేయడం కనిపించింది. ఎంతమంది చిన్నచిన్న వినాయకులను బైకులపై తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. వినాయక నిమజ్జనం ప్రాంతంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఎలాంటి ఇబ్బంది కలవకుండా తగిన సౌకర్యాలు కల్పించారు