నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక్కవరం….
చిలప్ చేడ్/3సెప్టెంబర్/జనంసాక్షి :- నిరుపేదలకు సీఎం సహాయనిది ఒక్కవరం లాంటిదని తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చిట్కుల్ గ్రామ సర్పంచ్ యన్ గోపాల్ రెడ్డి అన్నారు గ్రామానికి చెందిన వ్యక్తి పాతూరి మాలాద్రి ప్రమాదంలో గాయపడగా ఈరోజు ఉదయం బాధిత కుటుంబానికి రూ.60000/- మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యన్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కొరకు కెసిఆర్ గారు, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కె రామచంద్ర రెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు