నిర్మల్‌లో అతిపెద్ద అంబేడ్కర్‌ భవన్‌: మంత్రి

share on facebook


నిర్మల్‌,అగస్టు26(జనంసాక్షి): తెలంగాణలోనే అతి పెద్ద అంబేద్కర్‌ భవన్‌ మన నిర్మల్‌ లోనే రాబోతుందని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ భవన్‌ అభివృద్ధి పనులను గురువారం న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్‌ భవన్‌ నిర్మాణ పనులకు గతంలో రూ.2 కోట్లు నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి అదనంగా రూ. కోటి 50 లక్షల నిధులు మంజూరు చేయించామని మంత్రి తెలిపారు. 3,4 నెలల్లోనే భవనం పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్‌ హావిూ ఇచ్చారని పేర్కొన్నారు.

Other News

Comments are closed.