నీటిని తరలిస్తే అడ్డుకుంటాం : గంగాధర్‌గౌడ్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 : సింగూరు ప్రాజెక్టు నుండి ఆందోల్‌కు నీటిని తరలించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, తరలింపును అడ్డుకుంటామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎంను ప్రసన్నం చేసుకోవడం ద్వారా తన సీటును కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి మంజీర నదిపై ఎత్తిపోతల పథకం నిర్మించి ఆందోల్‌కు నీటిని తరలించాలనుకోవడం శోచనీయమన్నారు. ఇప్పటికే సింగూరు నీటిని హైదరాబాద్‌ ప్రజల సింగూరు ప్రాజెక్టు నుండి ఆందోల్‌కు నీటిని తరలించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎంను ప్రసన్నం చేసుకోవడం ద్వారా తన సీటును కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి మంజీర నదిపై ఎత్తిపోతల పథకం నిర్మించి ఆందోల్‌కు నీటిని తరలించాలనుకోవడం శోచనీయమన్నారు. ఇప్పటికే సింగూరు నీటిని హైదరాబాద్‌ ప్రజల తాగునీటి అవసరాల కోసం తరలిస్తూ నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులను నట్టేట్ట ముంచుతున్నారని అన్నారు. నిజాంసాగర్‌కు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా  సింగూరును నిర్మించారని ఆయన గుర్చు చేశారు. నిజాంసాగర్‌కు 8.35 టిఎంసిల సింగూరు నీటిని ఇవ్వాలని ఒప్పందం జరిగిందన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల గతకొన్ని సంవత్సరాలుగా సింగూరు పూర్తిస్థాయిలో నిండడంలేదని ఇలాంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు, నీటిని తరలింపు చేయాలనుకోవడం అన్యాయ మన్నారు. ఇందుకోసం జీవోను విడుదల చేశారని తెలిసిందని ఒక వేళ జీవో ఇస్తే వెంటనే దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో జిల్లా రైతాంగంతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. జిల్లాకు చెందిన భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖమంత్రి పి.సుదర్శన్‌రెడ్డి నీటి తరలింపును అడ్డుకొని సింగూరును నిజాంసాగర్‌కే ధారాదత్తం చేసేలా కృషి చేయాలని విజి గౌడ్‌ డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో టిడిపి మాజీ జిల్లా అధ్యక్షుడు ఆకుల శంకర్‌, నగర అధ్యక్షుడు అంబదాస్‌ తదితరులు పాల్గొన్నారు.