నీటి గుంతలో పడి ముగ్గురు విద్యార్ధులు మృతి

నల్గొండ: నీటి గుంతలో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాదఘటన నల్గొండ జిల్లా బీబీనగర్‌ మండలం జియాపల్లి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన శ్యామ్‌, చందు, మోశాంత్‌ అనే ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటి గంతలో మునిగి మృతి చెందారు.