నేడు కరీంనగర్‌ జిల్లాలో గవర్నర్‌ పర్యటన

హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ నేడు కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి హుజూరాబాద్‌ చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వాసుపత్రిని సందర్శించి వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన సేవలను పరిశీలిస్తారు. అనంతరం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో సహకార గ్రామీణ బ్యాంకు, మహిళ డెయిరీని సందర్శించనున్నారు. గవర్నర్‌ పర్యటన  సందర్భంగా జిల్లాలో పోలీసులు  పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.