నేడు తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ
రంగారెడ్డి: తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ నేడు పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ‘ వస్తున్నా.. మీకోసం’పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న సందర్భంగా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడి మృతికి సంతాపం ప్రకటించిన అనంతరం ప్రజా సమస్యలు, నీలం తుపాను ప్రభావం గురించి నేతలు చర్చంచనున్నారు.