నేడు ముగింపు ఉత్సవం

ఏలూరు, జూలై 27 : మహిళా శిశు చైతన్య వారోత్సవాల సందర్భంగా కోటరామచంద్రాపురం, కొత్తరాజానగరం గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశౄలలో ఈ నెల 28వ తేదీ ఉదయం 10గంటలకు జిల్లా స్థాయి ముగింపు ఉత్సవం నిర్వహిస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాఘవరావు శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆహారం, పోషణ ఆవశ్యకత, సామాజిక సమస్యలపై విస్తృత ప్రచారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కిషోర బాలికల, తల్లిదండ్రులు పాల్గొనవలసిందిగా ఆయన కోరారు.