పలాస పురపాలక సంఘం ఎంపిక
శ్రీకాకుళం, జూలై 28: మైసురులో ఈ నెల 30,31, ఆగస్టు 1న నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు జిల్లాలోని పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘాన్ని ఎంపిక చేశారు. గణ వ్యర్థల నిర్వాహణ అనే అంశంపై మైసురులో సిటి కార్పొరేషన్, జాదంపూర్ (కోల్‌కత) విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన సదస్సు నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్రలో పలాస కాశీబుగ్గతో పాటు, విజయనగరం జిల్లా బొబ్బిలి, సాలూరు, పురసాలక సంఘాలను ఎంపిక చేశారు. ఆయా పురపాలక సంఘ కమిషనర్లు, పారిశుద్ధ్య పర్యవేక్షలు, పర్యావరణ ఇంజనీర్లు సదస్సులో పాల్గొననున్నారు.