పశ్చిమలో భారీ వర్షం

ఏలూరు, జూలై 31 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24గంటల్లో 4.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళిక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ మంగళవారం నాడు ఒక ప్రకనటలో తెలిపారు. జిల్లాలో అత్యధికంగా పెరవలి మండలంలో 12.6 మిల్లీమీటర్లు, అత్యుల్పంగా తాళ్లపూడి మండలంలో 1.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు అయింది. కాగా జీలుగుమిల్లిలో 1.4, బుట్టాయిగూడెంలో 1.8, గోపాలపురంలో 5.8, కొయ్యలగూడెంలో 2.2, జంగారెడ్డిగూడెం, టి-నర్సాపురంలలో 2.8, నల్లజర్లలో 3, దేవరపల్లిలో 4.6, చాగల్లులో 7.4, కొవ్వూరులో 10.4, నిడదవోలు 3.2, తాడేపల్లిగూడెంలో 2.4, ఉంగుటూరులో 2.2, భీమఢోలులో 1.2, పెదవేగిలో 0.4, దెందులూరులో 1.8, నిడమర్రులో 5.6, గణపవరంలో 4.8, పెంటపాడులో 5.6, తణుకులో 11.8, నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 8.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు అయింది.