పాఠశాలకు బెంచీలు అందజేతపాఠశాలకు బెంచీలు అందజేత

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణ సూపర్ బజార్ సెంటర్లో  ఉన్న తెలంగాణ గురుకుల బాలిక పాఠశాలకు సింగరేణి హైస్కూల్ ఇంగ్లీష్ మీడియం 1986-87 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి  సుమారు 40 వేల రూపాయల విలువ చేసే 8 బెంచ్ లను గురుకుల పాఠశాలకు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు  సింగరేణి పాఠశాలగా ఉండేదని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థినుల కోసం గురుకుల  పాఠశాలగా ఏర్పాటు చేసిందని,  విద్యార్థుల సంక్షేమం కోసం తమ వంతు సహాయంగా బెంచీలు అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సింగరేణి పాఠశాల పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.