పాఠశాల సమస్యలను పరిష్కరించాలి

మాచారెడ్డి జులై 5 (జనంసాక్షి)
మాచారెడ్డి మండల కేంద్రంలో ఉన్న పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పి.డి.ఎస్‌.యూ మండల శాఖ అధ్యక్షులు దేవరాజు ఆధ్వర్యంలో సిరిసిల్లా కామారెడ్డి రహదారిపై సుమారు గంట పాటు రాస్తారోకో చేసారు. ఈ సంధర్భంగా దేవరాజు మాట్లాడుతూ మాచారెడ్డి కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రహారి గోడ లేనందున స్కూల్‌ ఆవరణలోకి విషపురుగులు, పందులు, సంచరిస్తుండడంతో మెదడువాపు వ్యాధులు సోకుతాయని భయం భయంతో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.బి.సి బాలుర వసతి గృహంలో టైలెట్స్‌ లేకపోవడంతో హస్టల్‌లోకి దుర్వాసన వస్తుందని ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్‌, రవి, రాము, జనార్ధన్‌, సాయ, తదితరులు పాల్గొన్నారు.