పినపాక పిహెచ్సి నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు పట్ల టిఆర్ఎస్ పార్టీ హర్షం..
పినపాక నియోజకవర్గం, ఆగస్టు27(జనంసాక్షి):- కోటి 56 లక్షల వ్యయంతో నూతన భవన నిర్మాణానికి కృషిచేసిన ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉభయ ఏజెన్సీ మండలాలైన కరకగూడెం పినపాక లలో బడుగు బలహీన వర్గాలు,నిరుపేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజారోగ్యం పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కాంతారావు కి ఉన్న చిత్తశుద్ధికి నిధుల కేటాయింపు నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, పిఎసిఎస్ చైర్మన్ రవి శేఖర్ వర్మ, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు భవాని శంకర్, దాట్ల వాసు బాబు, వార నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.