పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
గరిడేపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): మండలంలోని పొనుగోడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1995-96వ సంవత్సరంలో చదివిన విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకయ్య, అమృత రెడ్డి, పూర్ణచంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, పూర్వ విద్యార్థిని విద్యార్థులైన ముత్తినేని కోటేశ్వరరావు, రామయ్య ,నాగేశ్వరరావు, గురుమూర్తి, సతీష్ రెడ్డి ,శేఖర్ రెడ్డి, పుష్ప, శ్రీవాణి ,వనిత, జయమ్మ, సుజాత ,పద్మ, సునీత ,కళావతి ,రహీమా , వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.