పెగడపల్లి శివాలయం ఆదాయం రూ.3.95లక్షలు
పెగడపల్లి: మండల కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా రూ. 3.95లక్షల ఆదాయం సమకూరింది. మంగళవారం హుండీ లెక్కింపు జరిపారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కరుణాకరరావు, సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.