పెట్రోల్ డీలర్లకు కమీషన్ పెంచాలి
గుంటూరు: పెట్రోల్ డీలర్లకు కమీషన్ పెంచాలని పెట్రో డీలర్ల సమాఖ్య ప్రభుత్వన్ని డిమాండ్ చేసింది. ఈ రోజు గుంటూరులో డీలర్ల సమాఖ్య సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. అక్టోబరు 1,2 తేదీల్లో ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోలియం కొనుగోళ్లు నిలిపి వేయాలని నిర్ణయించారు. అక్టోబర్ 15 నుంచి సింగిల్ షిప్టులో మాత్రమే పెట్రోల్ దుకాణాలు పని చేస్తాయని వెల్లడించారు.