పెరిగిపోతున్న చైన్ స్నాచర్ల ఆగడాలు
కర్నూలు, జూలై 25 : కర్నూలు పట్టణంలో చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
వీరికి లోపాయికారిగా పోలీసుల సహకారం ఉండడం వల్లే వీరు పెట్రేగిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల నగరంలో జరిగిన చోరీలన్నీ పోలీసుల కనుసన్నల్లోనే జరిగినట్టు వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ మూడో టౌన్, నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్లలో నమోదైన చైన్ స్నాచర్ల కేసులన్నీ పోలీసుల కనుసన్నల్లో జరిగినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో 8 మంది చైన్ స్నాచర్లు ఇదే పనిలో ఉంటారని వారు ఆరోపణ వినవస్తున్నాయి. అలాగే మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురు పాత నేరస్థులే చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నట్లు బాధితులు బాహాటంగా ఆరోపిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి చైన్ స్నాచర్ల ఆగడాలను అరికట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.