పేకాటరాయుళ్లు అరెస్ట్‌

ఒంగోలు, జూన్‌ 24 : పేకాట శిబిరాలపై ఆదివారం జరిపిన దాడుల్లో 11 మంది అరెస్ట్‌ అయినట్లు స్థానిక ఎస్‌ఐ శ్రీహరిరావు తెలిపారు. మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో ఏడుగురిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి మూడు వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని అలాగే పోతుకట్ల గ్రామంలో నలుగురిని అరెస్ట్‌ చేసి వారి వద్ద 1000 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.