*పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే గండ్ర.
* బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్ పత్రాలు,
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.
చిట్యాల 27(జనం సాక్షి)పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు.మంగళవారం మండలంలోని జడల్ పేట, భావు సింగ్ పల్లి, సిఆర్పల్లి , కైలాపూర్, ఏలేటి రామయ్య పల్లి,చిట్యాల, నవాబ్ పేట, తిరుమలాపూర్, గుంటూరు పల్లి, గ్రామాలలో బతుకమ్మ చీరలు ఆసరా పింఛన్ పత్రాలు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి అద్దంపట్టే దసరా వేడుకలను మహిళా సోదరీమణులు ఘనంగా జరుపుకోవాలని కోరారు. పండగ కానుక ప్రతి ఏటా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.అర్హులైన వృద్ధులకు, వికలాంగులకు, వితంతువు, ఒంటరి మహిళలకు, బీడీ, గీత, చేనేత కార్మికులకు నూతనంగా ఆసరా పింఛన్లను మంజూరు చేయడం జరిగిందని, మంజూరు పత్రాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ,ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, జడ్పీటీసీ గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి తెరాస మండల అధ్యక్షులు ఆరెపల్లి మల్లయ్య, తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపిడి ఓ రామయ్య, ఎంపీ ఓ రామకృష్ణ, సర్పంచులు కామిడి రత్నాకర్ రెడ్డి, దామెర బోయిన నారాయణరావు, చింతల శ్వేతా సుమన్, కసిరెడ్డి సాయి సుధా రత్నాకర్ రెడ్డి, ఏలేటి సరోజన, హజ్ర బేగం, పువ్వాటి రాణి వైస్ ఎంపీపీ రాంబాబు, వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ లు కట్కూరి పద్మ నరేందర్, చేరాల సౌభాగ్య సదానందం , మండల యూత్ అధ్యక్షులు తౌటం నవీన్, పెరుమాండ్ల రవీందర్, పాండ్రాల వీరస్వామి, శ్రీధర్, రమణాచారి, రవీందర్, నాయకులు కార్యకర్తలు, ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.