పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది

 పంచాయతీ రాజ్, గ్రామీణ  అభివృద్ధి శాఖ  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..
హన్మకొండ బ్యూరో చీఫ్ 22 సెప్టెంబర్ జనంసాక్షి
గురువారం  నాడు పోడు వ్యవసాయం చేసుకుంటున్న పోడు వ్యవసాయదారులకు సమస్యలు,  అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా చేపట్టే సంరక్షణ చర్యలపై జిల్లా కలెక్టర్ సమావేశ మందిరం   లో ఏర్పాటుచేసిన సమన్వయసమావేశానికి మంత్రులు  ఎర్రబెల్లి దయాకర్ రావు  సత్యవతి రాథోడ్, పలువురు ప్రజాప్రతినిధులు  హజరయ్యారు.ఈ సమావేశానికి హాజరైన  ప్రజా ప్రతినిధులు తమ సలహాలను, సూచనలను అందజేశారు.
 ఈ సందర్భంగా
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ సుదీర్ఘమైన పోడు సమస్య శాశ్వత పరిష్కారానికై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, అందుకు అనుగుణంగా అటవీ హక్కుల చట్టం- 2005 నియమనిబంధనల ప్రకారం పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి శాశ్వతం పరిష్కారం దిశగా సమస్యకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని మంత్రి అన్నారు. . పోడు వ్యవసాయదారులకు న్యాయం చేసేందుకు అడవులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని,  అటవీ హక్కుల చట్టం- 2005 పరిధి కి లోబడి పోడు వ్యవసాయ దారులకు న్యాయం చేకూర్చేందుకు సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని,  అన్నారు.  ఇకముందు అడవుల నరికివేతకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయని, అడవుల నరికివేత వలన వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని అన్నారు.. ప్రతి ఒక్కరూ అడవుల సంరక్షణకు కట్టుబడి ఉండాలని,మానవ,జీవ జాతుల మనుగడ అడవుల సంరక్షన పై ఆధారపడి ఉందని అన్నారు.అడవుల క్షీణత వలన  ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని,పర్యావరణ సమస్యలు వస్తున్నాయని అన్నారు.అడవుల పునరుద్ధరణ లో దేశం లో రాష్ట్రం ముందు ఉందని అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కు రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు అటవీ హక్కు లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.  పోడుసమస్య పరిష్కారం చర్యలకు గాను అటవీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో పారదర్శకంగా తమ విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని మంత్రి సూచించారు.
ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ
పోడు భూముల పట్టాల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం జీఓ 140 జారీ చేసిందని, ఇందుకు అనుగుణంగా అధికారులు ఎటువంటి పొరపాట్లు లేకుండా   చూడాలి అని అన్నారు.అదే విధంగా అటవీ సంపదను కాపాడుకోవడం తో పాటు, భవిష్యత్తులో ఆక్రమణ కు గురి కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.   అరుహులైన ప్రతి ఒక్కరికి పోడు భూముల పట్టాలు అందించి హక్కు కల్పించేందుకు   ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి అన్నారు.
అటవీ, రెవెన్యూ అధికారులు క్షేత్ర పర్యటనకు వెళ్ళినప్పుడు ఎఫ్. ఆర్. సి. కమిటీకి సమాచారం అందించడంతో పాటు రిజిస్టర్ లో వివరాలు నమోదు చేయాలని, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, బీట్ అధికారి క్షేత్ర పర్యటనకు వెళ్ళినప్పుడు సంబంధిత కోఆర్డినేటర్ ద్వారా జి.పి.ఎస్. నమోదు చేయాలని, సర్వే బృందం ప్రతిరోజు  దరఖాస్తులను పరిశీలించాలని తెలిపారు., ప్రతి దరఖాస్తులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. గ్రామపంచాయతీల వారిగా దరఖాస్తులను పరిశీలించడానికి కార్యచరణ రూపొందించి తేదీలను నిర్ణయించి సర్వే పనులు ప్రారంభించాలని, సర్వే తేదీలను ముందుగానే దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ పోడు వ్యవసాయదారులకు అటవీ హక్కుల కల్పన కు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు తూచ తప్పకుండా పాటిస్తామని అన్నారు.  పోడు సాగు పై   రెండు వా రాలలో యాక్షన్ ప్లాన్  అమలుకు అన్నీ చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి, మేయర్ గుండు సుధారాణి, నర్సంపేట ఎమ్మేల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ డా. గోపి, ఏటూరు నాగారం ఐటీడీయే పీ ఓ అంకిత్, అటవీ, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.