పోస్టు కార్డులు పంపిణీ చేసిన విఆర్ఏలు.

పోస్టు కార్డులతో విఆర్ఏలు.
బెల్లంపల్లి, సెప్టెంబర్28,(జనంసాక్షి)
విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విఆర్ఏ చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 66వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయ విఆర్ఏలు తమ సమస్యలు అయిన పే స్కెల్ అమలు జీవో, అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్లు, 55 సంవత్సరాలు దాటిన విఆర్ఏల స్థానంలో వారి వారసులను విఆర్ఏగా నియమించాలనే డిమాండ్లను వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోస్టు కార్డులు పోస్ట్ చేశారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయ విఆర్ఏలు పాల్గొన్నారు.