ప్రతిభ చాటిన పల్లికొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
భీంగల్ ప్రతినిధి(జనంసాక్షి):75 వ భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా భీంగల్ పట్టణం లో నిర్వహించిన వాలీబాల్ క్రీడల్లో భీమ్గల్ మండలం పల్లికొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. వాలిబాల్ బాలికల, బాలుర విభాగంలో ప్రథమ స్థానం సాధించారు. ప్రథమ స్థానం సాధించిన క్రీడాకారులను బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ రమేష్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు హరినాథ్, స్థానిక సర్పంచ్ ఏనుపోతుల యమున,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.