ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువతదే కీలకపాత్ర.
– టీఆర్‌ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షుడు గొనెల నాని.
బూర్గంపహాడ్ ఆగష్టు25 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం స్థానిక మార్కెట్ యార్డులో జరిగిన మండల యూత్ కమిటీ సమావేశం లో రాజకీయాల్లో, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువకుల కీలకపాత్ర పోషించాలని టీఆర్‌ఎస్ పార్టీ స్థానిక మండల యువజన అధ్యక్షుడు గోనెల నాని అన్నారు. శుక్రవారం మార్కెట్ యార్డు లో జరిగిన మండల యూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాజకీయాల్లో యువకులు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్దిని అందరికి తెలిసేలా గ్రామాల్లో యువత భాధ్యత తీసుకోవాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలనన్నారు. ప్రజాప్రతినిధులను, సీనియర్ నాయకులను కలుపుకొని రాజకీయాలు చేయాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు వస్తాయన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పధకాలు అమలు చేస్తుందన్నారు. పినపాక నియోజకవర్గం అభివృద్ది కేవలం ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే సాధ్యమన్నారు. ఈ సమావేశంలో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ గోపిరెడ్డి రమణారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, నియోజకవర్గ స్టీరింగ్ కమిటీ సభ్యులు మేడం లక్ష్మీనారాయణ రెడ్డి, నియోజకవర్గ యువత వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణచంద్ర రావు, మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, మండల యూత్ ప్రధాన కార్యదర్శి యడమకంటి సుధాకర్ రెడ్డి, రెడ్డిపాలెం టౌన్ ప్రెసిడెంట్ కాటo వెంకటరామిరెడ్డి, మొండెద్దుల వెంకటేశ్వర రెడ్డి, తెరాసా మండల నాయకులు తోకల సతీష్, గంగరాజు యాదవ్, సుధాకర్, మహేష్, నవీన్, సాయిరాం, ప్రసాద్ తో పాటు మండలంలోని ప్రతీ గ్రామం నుంచి యువత భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.