ప్రశాంతంగా హుజూరాబాద్‌ ఎన్నిక

share on facebook

ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు
పలు గ్రామాల్లో క్యూలో నిల్చుకున్న మహిళలు
పరిస్థితిని పరిశీలించన కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌
కోర్కల్‌ గ్రామంలో ఇరువర్గాల ఘర్షణతో స్వల్ప ఉద్రిక్తత
కమలాపూర్‌లో భార్యతో కలసి ఓటేసిన ఈటెల రాజేందర్‌
హుజూరాబాద్‌,అక్టోబర్‌30(జనంసాక్షి) : హుజూరాబాద్‌లో ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా మొదలయ్యింది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. గతంలో ఎప్పుడూ లేనంతగా క్యూలైన్లలో మహిళల ఉదయమే చేరుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 10.5 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ఓటర్లు తమ వంతు కోసం వేచిచూస్తున్నారు. హుజూరాబాద్‌, వీణవంక, కమలాపూర్‌ మండలాల్లో భారీ సంఖ్యలో ఓట్లర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటుండగా, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పోలింగ్‌ కొంత నెమ్మదిగా కొనసాగుతున్నది. హుజురాబాద్‌ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ శాతం భారీగా నమోదు అయ్యింది. ఐదు మండలాల్లో 33.27 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓటు వేసుకుందుకు మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాల
వద్ద బారులు తీరారు. తొలి నాలుగు గంటలకే 33.27 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. అలాగే పోలీసులు ప్రత్యేక నిఘాతో బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఉదయం 9.30గంటల వరకు హుజూరాబాద్‌ మండలంలో 11.10 శాతం, వీనవంక మండలంలో 11.15 శాతం, జమ్మికుంటలో 10.39 శాతం, ఇల్లందకుంటలో 8.22 శాతం, కమలాపూర్‌లో 10.52 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతున్నదని కరీంనగర్‌ కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వీణవంకలో పోలింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. రాత్రి 7 గంటలలోపు పోలింగ్‌ బూత్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఉదయం నుంచి ప్రశాంతంగా సాగిన ఈ ఉప ఎన్నికలో కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హుజురాబాద్‌ వీణవంక మండలం కోర్కల్‌ గ్రామంలో టెన్షన్‌ వాతా వరణం నెలకొంది. కోర్కల్‌ లో పోలింగ్‌ కేంద్రం వద్ద టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతా వరణం నెలకొంది. ఈ తరుణంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొట్టుకున్న కార్యకర్తల్లో మహిళలు కూడా ఉన్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలింగ్‌ కేంద్రం వద్ద టెన్షన్‌ వాతా వరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు పరుగులు తీశారు. అయితే.. పోలింగ్‌ కేంద్రం వద్ద 100 విూటర్ల లోపు కార్యకర్తలు వచ్చి ప్రచారం చేస్తుండడంతోనే ఈ ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్‌లోని 262వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో తన భార్య జమునతో కలిసి ఈటెల రాజేందర్‌ ఓటు వేశారు. అనంతరం పోలింగ్‌ సరళిని గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్‌ ప్రజలు తమ గుండెల్లోని బాధలను ఓట్ల రూపంలో చూపిస్తున్నారన్నారు. పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రావడమే దీనికి నిదర్శనమన్నారు. మరోవైపు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీపై ఈటెల రాజేందర్‌ నిప్పులు చెరిగారు. ఉపఎన్నిక కోసం కొన్ని వందల కోట్లను టీఆర్‌ఎస్‌ ఖర్చుచేసిందని, దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ జీవోల ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టారని విమర్శించారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. పోలీసులే ఎస్కార్ట్‌ ఇచ్చి డబ్బును, మద్యాన్ని పంచిపెడుతున్నారని ఈటెల మండిపడ్డారు. ఓటర్లకు డబ్బులు పంపచారని ,బహిరంగంగానే ప్రజలు తమక్కూడా డబ్బులు ఇవ్వాలంలూ పలు గ్రామాల్లో నినదించారని అన్నారు.
టీఆర్‌ఎస్‌ నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని.. ఏదేమైనా అంతిమంగా ధర్మం విజయం సాధిస్తుందని ఈటెల స్పష్టం చేశారు.

Other News

Comments are closed.