ప్రేమించలేదని అమ్మాయి గొంతు కోశాడు
ఆదిలాబాద్ : తనను ప్రేమించలేదని ఓ యువకుడు తాను ప్రేమించిన యువతిని దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే… జిల్లాలోని తిర్యాని మండలం గుండాలలో ఓ యువకుడు తనను ప్రేమించడం లేదని అదే గ్రామానికి చెందిన యువతిని కత్తితో పొడిచి పారిపోయాడు. స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతిచెందింది. ఈ ఘటన గురువారం అర్థరాత్రి జరిగింది. పక్క గ్రామంలో ఓ ఉత్సవానికి హాజరై వస్తున్న మృతురాలు ప్రమీలను ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో అడ్డగించిన ప్రేమోన్మాది శ్రీను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.