ఫార్మూలా రేసర్‌ హోమిల్టన్‌ సరికొత్త చరిత్ర

share on facebook

కెరీర్‌లో 100వ విజయం సాధించి రికార్డు
మాస్కో,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : ఫార్ములా`1 రేస్‌లో లూయిస్‌ హామిల్టన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వంద రేస్‌లు నెగ్గిన తొలి ఎఫ్‌`1 డ్రైవర్‌గా రికార్డులకెక్కాడు. ఆదివారం జరిగిన రష్యన్‌ గ్రాండ్‌ ప్రీలో మెర్సిడస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్స్‌), కార్లోస్‌ జెయింజ్‌ జూనియర్‌ (ఫెరారీ) రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు. కెరీర్‌లో 100వ విజయం సాధించిన హామిల్టన్‌.. చాంపియన్‌షిప్‌ రేసులో మరోసారి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. గత కొంత కాలంగా ఊరిస్తూ వస్తోన్న ’విక్టరీల సెంచరీ’ని హామిల్టన్‌ రష్యా గ్రాండ్‌ప్రితో పూర్తి చేశాడు. ఆదివారం జరిగిన 53 ల్యాప్‌ల ప్రధాన రేసును అతడు గంటా 30 నిమిషాల 41.001 సెకన్లలో పూర్తి చేశాడు. రెండో స్థానంలో వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌)… మూడో స్థానంలో కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ) నిలిచారు. పోల్‌ పొజిషన్‌ నుంచి రేసును ఆరంభించిన లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Other News

Comments are closed.