ఫోటో రైటప్: నివాళులర్పించిన జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి

సంతాపం తెలిపిన జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి
స్టేషన్ ఘనపూర్, ఆగస్టు 28, ( జనం సాక్షి ) : నియోజకవర్గ కేంద్రం నందు స్టేషన్ ఘణపూర్ మండల మాజీ ఎంపిపి గట్టు శోభ భర్త గట్టు రాజు (55)అనారోగ్యంతో మృతిచెందడం జరిగింది. విష యం తెలుసుకున్న జనగామజిల్లాపరిషత్ చైర్మన్, టిఆర్ఎస్  జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి అక్కడికి చేరుకుని మృతిచెందిన గట్టు రాజు పార్థి వ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు.అనంతరం మృతు డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సా నుభూతి వ్యక్తం చేసారు. పరామర్శించిన వారిలో జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎంపీ టీసీ గన్ను నర్సింలు, టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు గట్టు రమేష్,నాయకులు నాగబోయిన యాదగిరి, గట్టు రమేష్, శ్రీనివాస్, సమ్మయ్య తది తరులు పాల్గొన్నారు.