బంగ్లాదేశ్‌లో అగ్ని ప్రమాదం. 11 మంది మృతి
ఢాకా : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివారులోనిమురికివాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారు. మస్కిటో కాయిల్ నుంచి నిప్పు రవ్వలు ఎగసిపడి మంటలు ఆ ప్రాంతంలోని ఇళ్లకు వ్యాప్తించినట్లు అధికారులు తెలియజేశారు. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనం కాగా మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకొని గాయపగ్గ ఏడుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిలో అగ్నిమాపక సిబ్బంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.