*బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు*
మద్దూర్ (జనంసాక్షి):నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో మండల ప్రజా ప్రతినిధులు బతుకమ్మ చీరలు, మరియు ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి కొత్త చీరలు పంపిణీ చేస్తుందని అన్నారు. తెలంగాణ ఆడపడుచులందరూ ప్రభుత్వం పంపిణీ చేసిన కొత్త చీరలను కట్టుకొని బతుకమ్మ సంబరాలను సంతోషంగా జరుపుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రఘుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ వెంకట్ రెడ్డి, ఏపీఎం గోపాల్, సర్పంచ్ శిరీష, టిఆర్ఎస్ నాయకులు నెల్లి రాములు, బసప్ప తదితరులు పాల్గొన్నారు.