బతుకమ్మ చీరల పంపిణీ చేసిన డీసీఎంఎస్ చైర్మన్: శ్రీకాంత్ రెడ్డి
ధర్మపురి సెప్టెంబరు 28 (జనం సాక్షి న్యూస్) చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశ్యంతో సీఎం కేసిర్ బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని సంకల్పించారని,
జగిత్యాల జిల్లాలో ధర్మపురి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ మండల పరిషత్ ఎంపీడీవో వేదికగా బుధవారం లాంచనంగా ప్రారంభించి, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన డీసీఎంఎస్ చైర్మన్ డా. ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి,తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి ఆన్ని పండుగలు అధికారికంగా నిర్వహిస్తున్నారని,డీసీఎంఎస్ చైర్మన్ అన్నారు.అందులో భాగంగానే తెలంగాణ లో అత్యంత ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల సందర్భంగా ఆడ బిడ్డలకు చీరల పంపిణీ చేపట్టినట్లు డీసీఎంఎస్ చైర్మన్ తెలుపుతూ,ప్రతి మహిళ సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి పది లక్షల మందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నమన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అధికారంలో ఉన్న పాలకులు ఏనాడు ప్రజలకు ముఖ్యంగా మహిళల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు, అంతే కాదు బతుకమ్మ చీరల పంపిణీ వెనుక గొప్ప ఆంతర్యం ఉందన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశ్యంతో సీఎం కేసిర్ బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని సంకల్పించారని, చైర్మన్ తెలిపారు.నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తూ, చేనేత కార్మికుల ఆకలి చావులకు అడ్డుకట్ట వేశామన్నారు. తెలంగాణ ఉద్యమంతో బతుకమ్మకు గుర్తింపు వచ్చిందన్నారు.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజమాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మను ప్రపంచ దేశాలకు తీసుక వెల్లిందన్నారు. ఇది అర్థం చేసుకోలేని వారు పలు రకాల విమర్శలు చేస్తున్నారని విమర్శిస్తున్నారని చైర్మన్ విరుచుకు పడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తేమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న, జడ్పిటిసి బత్తిని అరుణ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, కమిటీ అధ్యక్షుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అయ్యోరి రాజేష్ కుమార్, వైస్ చైర్మన్ అక్కేపల్లి సునీల్ నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.