బతుకమ్మ చీరల పంపిణీ
తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 29, (జనంసాక్షి) :
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు దసరా కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలను మండలంలో ని, మేఘ్య తండ గ్రామంలో సర్పంచ్, కేలావత్ సాజి భిక్షనాయక్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి తెలంగాణ ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరలను అందజేసి వారు పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునేలా చూశాడని కొనియాడారు . ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామకృష్ణ, బాలు రూప్ల తదితరులు పాల్గొన్నారు.