బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

రామగుండం రూరల్‌:కమాన్‌పూర్‌ మండలం జీడీ నగర్‌లో బాల్య వివాహాన్ని గురువారం వసంతనగర్‌ ఎస్‌ఐ రమేష్‌ అడ్డుకున్నారు. 14 సంవత్సరాల బాలికకు 26ఏళ్ల అబ్బాయితో వివాహం జరిపేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసుల అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆమ్మాయి తల్లిదండ్రులు వంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని నచ్చజెప్పారు.