బావమరిదిని కత్తితో పొడిచిన బావ
హన్మకొండ,అక్టోబర్30 (జనంసాక్షి) : జిల్లాలోని వేలేరు మండలంలో దారుణం జరిగింది. ఇంటి విషయంలో గొడవ జరగడంతో బామ్మర్దిని కత్తితో పొడిచి హత్య చేసేందుకు బావ యత్నించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బామ్మర్దిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.