బీసీ సంఘం ఆధ్వర్యంలో గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్ కు ఘన సన్మానం.

జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత ను సన్మానించిన బీసీ నాయకులు.
తెలంగాణ ఉద్యమంలో బీసీల పాత్ర కీలకం
 -జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ 
బిసి సంఘానికి అండగా నిలిచిన నాయకుడు రాజు గౌడ్
బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి.
తాండూరు సెప్టెంబర్ 27(జనంసాక్షి)ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను తాండూర్ నియోజవర్గ బిసి సంఘం కన్వీనర్ రాజ్కుమార్ కందుకూరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ది గ్రీన్ అండ్ సీడ్స్ మార్కెట్ అసోసి యేషన్ కార్యాలయంలో మంగళవా రం ఇటీవల జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నియమితులైన ఎస్ రాజు గౌడ్ ని మరియు వికారాబాద్ జిల్లా బీసీ మహిళ అధ్యక్షురాలు గా నియమితులైన మధులత శ్రీనివాసాచారిని గజమాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఒక పక్క పార్టీల కోసం మరోపక్క బీసీల కోసం నిరంతరం శ్రమిస్తూ వస్తున్నానని అందులో భాగంగానే నేడు ఈ పదవి వరించిందన్నారు. రాబోయే రోజుల్లో చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ సాధించడంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మరియు బీసీ కులాలకు చెందిన యువకులదే ముఖ్యభూమిక అన్నారు .జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీ సంఘం ఎట్లాంటి కార్యక్రమం తీసుకున్న రాజు గౌడ్ పార్టీలకతీతంగా ముందుండేవారు అని అదేవిధంగా ఇకముందు కూడా బీసీల సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా బీసీ సమీకృత భవనం సాధన కోసం రాజు గౌడ్ కృషిచేయాలని కోరారు .వికారాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాసాచారి మాట్లాడుతూ బీసీ మహిళలకు పటిష్టత కోసం సామాజిక అభివృద్ధి కోసం తన వంతు బాధ్యత నిర్వహిస్తాను అని అన్నారు .జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ మరియు వికారాబాద్ జిల్లా  మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర బీసీ కార్యదర్శి సయ్యద్ షుకూర్ బీసీ మహిళా నియోజవర్గ అధ్యక్షురాలు జ్యోతి వికారాబాద్ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ మహిళా సంఘం నాయకురాలు ఉపాధ్యక్షు రాలు అనిత ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి ఆర్గనైజింగ్ సెక్రటరీ మంజుల యాలాల బిసి మండల అధ్యక్షులు లక్ష్మణాచారి, మండల యువజన సంఘం అధ్యక్షులు బసంత్ కుమార్, బిసి యువ నాయకులు రాము ముదిరాజ్,జుం టుపల్లి వెంకట్, టైలర్ రమేష్ ,పరమేష్, కాళికాదేవి ఆలయ కమిటీ మెంబర్ బద్రు, భాస్కర్ ,వెంకట్ చారి ,దుబాయ్ వెంకట్ శ్రీను మాదేవ్ మతిన్ బీసీ నాయకులు బిసి యువ నాయకులు వివిధ కులాలకు చెందినటువంటి అధ్యక్ష కార్యదర్శులు బీసీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.