బెల్లంపల్లి సిఓఈ విద్యార్థుల విజయకేతనం.

ఎంపికైన విద్యార్థులు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి విద్యార్థులు జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్ లో చూపిన ప్రతిభ ఆధారంగా ఐఐటీ, ఐఐఐటీలో సీటు సాధించారు. శుక్రవారం జోస (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) ప్రకటించిన మొదటి రౌండులో కేతావత్ ప్రకాష్ కు ఐఐటి మండి (హిమాచల్ ప్రదేశ్) మరియు ఆకుదారి ఆనంద్ కుమార్ కు త్రిబుల్ ఐటీ కర్నూలులో సీట్లు కేటాయించినట్లు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. కేతావత్ ప్రకాష్ కు బయో ఇంజనీరింగ్ 5 సంవత్సరాల బ్యాచిలర్ అండ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ డ్యూయల్ డిగ్రీ కోర్సు రాగా ఆకుదారి ఆనంద్ కుమార్ కు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 4సంవత్సరాల బ్యాచ్లర్ ఆఫ్ టెక్నాలజీలో సీటు వచ్చినట్లు ఆయన తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చూపడమే కాకుండా ఐఐటి త్రిబుల్ ఐటీ ల్లో ఇద్దరు విద్యార్థులు సీట్లు సాధించడం పట్ల ఆదిలాబాద్ రీజియన్ సాంఘిక సంక్షేమ గురుకులాల ఆర్ సి ఓ కొప్పుల స్వరూప రాణి, ఏఆర్సీఓ కోటి చింతల మహేశ్వరరావు, డి సి ఓ రామల బాలభాస్కర్ అభినందనలు తెలిపారు.