బ్రాహ్మణీయ అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుదాం
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 30(జనం సాక్షి)
మహాత్మ జ్యోతిబాపూలే స్థాపించిన సత్యశోధకు సమాజ్ 149వ ఆవిర్భావ దినోత్సవం ను దళితులపై జరుగుతున్న దాడుల కు వ్యతిరేకంగా జరపాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం రాత్రి 7 గంటల సమయంలో వరంగల్ నగరంలోని నక్కలపల్లిలో సదస్సు జరిగింది
ఈ సదస్సుకు ఐ ఎఫ్ టి యు నగర ప్రధాన కార్యదర్శి బన్న నర్సింగం అధ్యక్షత వహించారు ఈ సదస్సు ను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు మాట్లాడుతూ వేల సంవత్సరాల నుండి భారతదేశంలో కొనసాగుతున్న కుల వ్యవస్థ పీడిత వర్గాలను ఏ కాకులను చేసి శ్రమదోపిడి చేస్తూనే సంపదను వారికి దూరం చేసింది అంతేకాక ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ కుల వ్యవస్థ నిచ్చినమిట్లలో ఉండి దళితులను అంటరాని వారిగా చేస్తూ జంతువు కంటే హీనంగా చూస్తూ హత్యలకు పాల్పడు తున్నది నేడు దేశంలో దళితులపై జరుపుతున్న హత్యాకాండ భూస్వామ్య వర్గాలు అగ్రకుల దురహంకారులు భూమి పైనే కాక రాజకీయ ఆధిపత్యం కూడా వారి ఆధీనంలో ఉండడం వల్లనే ఈ అమానుష హత్యాకాండ కొనసాగుతున్నది
దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పి 75 సంవత్సరాలు కావస్తున్నా కులహింస దోపిడీ అణచివేత ఇంకా పోలేదు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దాని మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవకులు రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి సమానత్వ ప్రజాసాధికా హక్కులను రద్దు పరిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాయి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మనువాద సంస్కృతిని రాజ్యాంగబద్ధంగా చేసేందుకు పావులు కదుపుతున్నాయి, సాంఘిక విప్లవకారుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పీడిత కులాల కోసం పోరాడి విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తే నేటి మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు దోపిడి వర్గాలకు అప్పగిస్తూ ఉన్న కాస్త ఉద్యోగాలను కూడా లేకుండా చేస్తున్నది నేడు దేశంలో విద్యాలయాల్లో కుల ఉన్మాద దాడులు విచ్చలవిడిగా పెరగడానికి కారణం నేటి మోడీ ప్రభుత్వమే, ప్రతిరోజు ఒక దళితుడి కిడ్నాప్ ఇద్దరు దళితుల హత్యలు జరుగుతున్నాయి అట్లాగే ఈ దేశ పౌరులైన ముస్లిం ఇతర మైనారిటీ వర్గాలపై బిజెపి ఆర్ఎస్ఎస్ శక్తులు దాడులు చేస్తూ హత్య చేస్తున్నాయి, పీడిత వర్గాల ఐక్యతకు సమానతకు అడ్డంకిగా ఉన్న బ్రాహ్మణీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగానే కాక ఈ దోపిడీ వర్గాల భూస్వామ్య పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించ డమే మహాత్మ జ్యోతిబాపూలే సావిత్రిబాయిలకు మనం అందించే నివాళి అని అలాంటి ఉద్యమాల నిర్మాణానికి దళిత పీడిత వర్గాలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు
ఇంకా ఈ సదస్సులో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు ఐ ఎఫ్ టి యు అధ్యక్షులు జయ బాబు, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు గండ్రతి హరిబాబు ఇతర నాయకులు అయిత యాకయ్య దళిత నాయకులు మన్నె కరుణాకర్ లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నక్కలపల్లి కార్మికులు ప్రజలు పాల్గొన్నారు