భర్తకు నిప్పంటించిన భార్య
తాడేపల్లిగుడెం: భర్తపై కిరోసిన్ పోసి హత్యాయత్నం చేసిందనే ఆరోపణలపై తాడేపల్లిగూడెం గ్రామీణ పోలీసులు శనివారం ఒక మహిళపై కేసు నమోదు చేశారు. మండలంలోని ఆరుగొలను గ్రామానికి చెందిన ఆకుల పెద్దిరాజు, నగలక్ష్మీలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శుక్రవారం రాత్రి పెద్దిరాజు మద్యం తాగి ఇంటికి వెళ్లాడు, మద్యానికి డబ్బులు ఎక్కడవని భార్య ప్రశ్నించగా ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆగ్రహించిన నాగలక్ష్మీ భర్త పడుకున్నాక అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. బాధితుడు తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.