భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు

విదేశీ సాయం అక్కర్లేదు
ప్రధాని మన్మోహన్‌
న్యూఢిల్లీ – భారతదేశ ఆర్ధిక పరిస్థితిని త్వరలోనే చక్కదిద్దుతామని, దీన్ని గాడిలో పెట్టడానికి విదేశీయుల సహాయం అక్కరలేదని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. మెక్సికో నుంచి ఆయన తిరిగి పయనమవుతూ విమానంలో విలేకరులతో మాట్లాడారు. మన ఆర్ధిక స్థితిని మనమే మంచి చర్యల ద్వారా చక్కదిద్దుకోవచ్చన్నారు. గత రెండు రోజుల్లో సంభవించిన పరిణామాల వల్ల మన సమస్యకు తీర్చడానికి అంతర్జాతీయ సహాయం అవసరంలేదని అవగతమైందన్నారు. మన ఆర్థిక సమస్యలను మన మేనేజ్‌మెంట్‌ ద్వారానే చాల సులువుగా అధిగమించగలమన్నారు. అదే విధంగా మనంతట మనమే ఆర్థిక సమతుల్యతను సాధించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.