ప్రజా సంక్షేమమే లక్ష్యం

 

 

 

 

 

 

 

భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 24 (జనం సాక్షి): ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని దోతిగూడెం గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం అంతమ్మగూడెం గ్రామంలో నూతన కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ గుమ్మి జంగారెడ్డి భూదానం చేసిన ఒక ఎకరం భూమిలో, సిఎస్ఆర్ కింద ఎజోలా కంపెనీ నిధులతో ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తదుపరి పట్టణ కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ తడక వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ కొయ్యడ రజిని, సర్పంచులు యాట జంగయ్య, గుమ్మి జంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భారత లవకుమార్, మండల అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ కళ్లెం రాఘవరెడ్డి, జిల్లా నాయకులు సామ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.