బిఆర్ఎస్ నేతల బుద్ది మందగిపు మాటలు

 

 

 

 

 

 

ఓర్మలేకనే…లేనిపోని ఆరోపణలు.
అబివృద్ది చూసి ఓర్వలేకనే బురదజల్లే ప్రయత్నం..
బిఆర్ఎస్ అవగాహన లేక పోవడంతో ఓటమి.
బిఆర్ఎస్ పాలనలో అబివృద్ది శీలాపలకాలకే పరిమితం..
సౌమ్యుడు……మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.
ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకులరా…..
మున్సిపల్ చైర్పర్సన్ నిరజబాల్ రెడ్డి.
తాండూరు ఫిబ్రవరి 24(జనంసాక్షి)కాంగ్రెస్ పాలనలో అబివృద్ది చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్నాయకులు బురదజల్లే ప్రయత్నం మాను కోవాలని మున్సిపల్ చైర్పర్సన్ నిరజబాల్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం తాండూర్ పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ నిరజబాల్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి ప్రజలుఇచ్చిన తీర్పును తట్టుకోలేక బిఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.ఎన్నిక లు ఎవైనా విజయం కాంగ్రెస్ పార్టీదే అన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో 52వేల ఓట్లు పోల్..అయ్యాయిప్రజలు 41శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ కి అవకాశం కల్పించారు. మున్సిపల్ ఎన్నికల్లోబిజేపి గల్లంతు అయిందన్నారు.సామరస్యంతో మా ఎమ్మెల్యే ముందుకు వేలుతున్నారు.బిఆర్ఎస్ అవగాహన లేక పోవడంతో ఓటమి పాలైందన్నారు.
బిఆర్ఎస్ పాలనలో అబివృద్ది దూరం అన్నారు.దూసీంచే స్వభావం మాది కాదు.నాన్ లోకల్ కాదు…లోకల్… మా ఎమ్మెల్యే.. మీరు ఎక్కడినుంచి వచ్చారో చేప్పాలన్నారు.అబివృద్ది చూసి ఆరోపణలు తగదన్నారు.తప్పు మీరు చేషి మా పై బురద జల్లడం సరికాదన్నారు. రంగులు మారుస్తున్నారని అంటున్నారు రంగులు మార్చే తత్వంమీదే నన్నారు .2సంవత్సరాలలో అబివృద్ది లో దుసుకు పోతున్నాం. ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకులరా అంటూ మండిపడ్డారు.పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం మీ విజ్ఞతే వదిలేశామన్నారు. రాబోరోజులలో బిఆర్ఎస్ కనుమరుగు ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, పట్టణ మాజీ అద్యక్షుడు ప్రభాకర్ గౌడ్ ,అబిబ్ లాల ,లింగదళ్లి రవికుమార్,సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్ తదితరులు ఉన్నారు.